భారతీయ సినిమా చరిత్రలో రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టబోడు అని జనాలంతా అనుకునేలా తన ప్రవర్తన ఉంటుంది. నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఆయన జీవితమంతా వివాదాలు మరియు విమర్శల తోనే నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు మొన్న చేసిన ఒక ట్వీట్ కారణంగా మెగాస్టార్ అభిమానులు దారుణంగా ట్రోల్  చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందో తెలుసా, " మూడు రోజుల క్రితం చిరంజీవి పుట్టిన రోజున మెగా కుటుంబంలోని అంతా చిరంజీవి ఇంటిలో కలుసుకున్నారు. అయితే ఏదో కారణం వలన అల్లు అర్జున్ ఆ వేడుకలో భాగం కాలేకపోయాడు". ఇది అసలు విషయం అయితే దీనిపై మన వివాదాల స్టార్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఈ సందర్భాన్ని వాడుకున్నారు. మెగా ఫ్యామిలీలో ఉన్న అందరి హీరోల కన్నా అల్లు అర్జున్ ఒక్కడే రియల్ స్టార్ అని ట్వీట్ చేశాడు.  దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అయితే ఈ విషయమై ఒక ఛానల్ రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి అసలు ఉద్దేశ్యం తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికి రామ్ గోపాల్ వర్మ చెప్పిన సమాధానాలు మెగా ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి మధ్యన అగాధాన్ని సృష్టించేలా ఉన్నాయి. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఈ చెప్పాడో ఒకసారి చూద్దాం. యాంకర్ మూర్తి  రామ్ గోపాల్ వర్మను, "ఎందుకు మీరు మెగా ఫ్యామిలీలో అందరి కన్నా బన్నీనే రియల్ స్టార్ అని అన్నారు అని అడిగాడు...దీనికి ఆయన సమాధానం... ఇక్కడ అందరూ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే చిరంజీవికి మరియు బన్నీకి నేను పోలిక పెట్టడం లేదు. నా ఉద్దేశ్యం అది కాదు. చిరంజీవి మెగాస్టార్ అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చిరంజీవి తర్వాత సినిమా రంగంలో రాణించిన వారందరి కన్నా బన్నీనే తన సొంత టాలెంటుతో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. అందుకే బన్నీ ది రియల్ స్టార్ అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్ లాంటి హీరోలు ఎప్పుడు వారి కెరీర్ గురించి మాట్లాడినా చిరంజీవి లేకపోతే మేము ఈ స్థాయికి వచ్చే వారము కాదు అని చెప్పడం నేను చూశాను.

 అయితే ఒక్క బన్నీ మాత్రమే మెగాస్టార్ చిరంజీవి గారిని నేనెప్పుడూ గౌరవిస్తాను అన్నాడే తప్ప... నేను చిరంజీవి వలనే స్టార్ హీరోగా ఎదిగాను అని అనడం నేనెప్పుడూ చూడలేదని రామ్ గోపాల్ వర్మ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. అంతే కాకుండా నేపోటిజం గురించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు ఆర్జీవీ. నెపోటిజం గురించి మనము కొంతకాలంగా వింటూ ఉన్నాము. కేవలం స్టార్స్ పిల్లలే ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదగడానికి పనికొస్తారా? మిగతా వారి పరిస్థితి ఏంటీ ? అదే విధంగా ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి స్టార్ హీరో కొడుకు కాదు. ఒక  కమెడియన్ అల్లు రామలింగయ్య కు మనువడు మాత్రమే. స్టార్ హీరోల పిల్లలు స్టార్ లు అయితే అక్కడ గొప్పతనం ఏమీ ఉండదు. బన్నీ లాగా ఒక కమెడియన్ మనుమడు ఇప్పుడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో స్టార్ హీరోగా ఎదిగాడు. అందుకే మెగా ఫ్యామిలీ లో ఉన్న మిగిలిన స్టార్ ల కనా బన్నీ రియల్ స్టార్ అని చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ఇందులో చిరంజీవిని నేను ఖచ్చితంగా తక్కువ చేసి మాట్లాడలేదు అని కూడా క్లారిటీ ఇవ్వడం విశేషం. దీనితో మరో వివాదం తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. బన్నీ vs మెగా హీరోలు గా ట్రోల్స్ నడిచే అవకాశం ఉంది. మరి ఈ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇంకెంత దూరం వీలేవుతాయో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: