ప్రస్తుతం బుల్లితెర ఆడియన్స్ ఫోకస్ మొత్తం బిగ్ బాస్ సీజన్ 5 మీదే ఉంది. మరికొన్ని గంటల్లో మొదలుకాబోతున్న ఈ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకి ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక గత కొన్ని రోజులుగా విడుదలవుతున్న బిగ్ బాస్ ప్రోమోలకి భారీ రెస్పాన్స్ వస్తోంది.ఇక బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ ని భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మొదటి ఎపిసోడ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అయితే గతంలో కంటే ఈసారి ఎక్కువ ఖర్చు చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు.

ఇక ఆ వివరాల్లోకి వెళ్తే...ఈసారి బిగ్ బాస్ సెట్ కోసం కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.ఇక కంటెస్టెంట్స్ కి కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.ఇక ఈ సీజన్లో పాల్గొనే కొంత మంది ప్రముఖ సెలెబ్రిటీలకు వారానికి 10 నుంచి 12 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.ఇక ముఖ్యంగా ఈసారి యూట్యూబ్ సెలెబ్రిటీలే ఎక్కువ రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈసారి ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారనే అంశం కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.గత సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.కంటెస్టెంట్స్ స్పెషల్ ఎంట్రీ లు అప్పట్లో ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈసారి కూడా ప్రతి ఒక్కరూ వారి టాలెంట్ తోనే హౌజ్ లోకి ఏంటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇక గత ఏడాది ఫైనల్ ఎపిసోడ్ కోసం అయితే ఏకంగా నాలుగు కోట్లు ఖర్చు చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.ఇక ఈసారిబిగ్ బాస్ 5 మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.బాలీవుడ్ వాళ్ళు మాత్రమే మొదటి ఎపిసోడ్ కి ఇంతలా ఖర్చు చేసేవారు.ఇక ఇప్పుడు ఈసారి తెలుగులో సీజన్ 5 మొదటి ఎపిసోడ్ కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారంటే నిర్వాహకులు ఏ స్థాయిలోప్లాన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరి ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్న మొదటి ఎపిసోడ్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే...!!


మరింత సమాచారం తెలుసుకోండి: