రామ్ చరణ్ తో ప్రముఖ దర్శకుడు శంకర్ త్వరలో తీయనున్న భారీ పాన్ ఇండియా మూవీ పై అందరిలో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. నిజానికి కొన్నేళ్ల క్రితం చిరంజీవి తో శంకర్ ఒక భారీ మూవీ తీయనున్నారు అనే వార్తలు రావడం జరిగింది, అయితే అది కార్యరూపం దాల్చలేదు. కాగా తనకు శంకర్ తో మిస్ అయిన ఛాన్స్ ప్రస్తుతం తనయుడు చరణ్ కు దక్కడంతో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని దిల్ రాజు, శిరీష్ ఎంతో గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మించనున్నారు. కియారా అద్వాని హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించనుండగా తిరు ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీ ఓపెనింగ్ ని నేడు హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహించింది యూనిట్. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్, మెగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సహా ఈ సినిమాలో ఇతర పాత్రలు చేస్తున్న అంజలి, సునీల్ ఇలా అనేకమంది ప్రముఖులు ఈ మూవీ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేశారు. ఆ ఫోటోలు నేడు ఉదయం నుండి ఎంతో వైరల్ అవుతున్నాయి.

అయితే షాకింగ్ గా ఈ మూవీ ఓపెనింగ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు అంటూ ఒక ఫోటో సడన్ గా నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టడంతో నిజంగా మహేష్ ఈ వేడుకకి వచ్చారని కొందరు భావించారు. అయితే ఆ తరువాత పరిశీలించిన అనంతరం అది కేవలం ఫ్యాన్ మేడ్ పిక్ మాత్రమే అని తెలిసింది. అయితే అది ఎడిట్ చేసిన పిక్ అయినప్పటికీ కూడా ఎంతో రియల్ గా ఉందని, మహేష్ కి మంచి ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ తప్పకుండా ఈ మూవీ తో మంచి సక్సెస్ అందుకోవాలని కోరుతూ పలువురు మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఆయనకు ముందస్తుగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: