దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో టాప్ ఫైవ్ లిస్టులో ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు. ఇతడు మంచి గాయకుడు కూడా. అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగి టాలెంట్ కు వయసుతో పని లేదు అని నిరూపించాడు.  దేవి శ్రీ ప్రసాద్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. దేవి సంగీతం అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది . తన టాలెంట్ తో దక్షిణాది స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారి ఎన్నో విజయాలను అందుకున్నాడు. 22 ఏళ్ల సినీ జర్నీలో సుమారు 143 చిత్రాలకు పైగా సంగీత దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా గాయకుడిగా ఎన్నో పాటలకు తన స్వరం పలికాడు. టాలీవుడ్ కోలీవుడ్ లోను తనను ఢీ కొట్టే వారు లేరని దూసుకుపోతున్నారు దేవి. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు దేవి శ్రీ ప్రసాద్. 

సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. మ్యూజికల్ గా కూడా రికార్డులు బ్రేక్ చేసింది. ఆ సినిమా వచ్చి 22 యేళ్లు దాటుతున్నా నేటికి దేవి సినిమాలోని పాటలను ఎంజాయ్ చేస్తుంటారు సంగీత ప్రేమికులు. తను మ్యూజిక్ అందించిన దాదాపు అన్ని చిత్రాల పాటలు అదే రేంజ్ లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. సినిమా సినిమాకి సంగీతంలో కొత్త బాణీలను అందిస్తూ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇటీవలే ఉప్పెన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేయగా ఆ సినిమాలోని పాటలు టాలీవుడ్ లో సునామీ సృష్టించి మ్యూజికల్ గా గొప్ప హిట్ ను అందుకున్నాయి. మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఒక సినిమా హిట్ కావాలంటే కథ, కథనం, హీరోతో పాటు మంచి సంగీతం కూడా తోడైతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది.

అలా ఎన్నో చిత్రాలు రికార్డులు బ్రేక్ చేయడంలో ముఖ్య భూమిక పోషించి సక్సెస్ అందుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్.  1999 దేవి సినిమాతో మొదలైన తన సంగీత సినీ ప్రయాణం నేటికి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖ సంగీత దర్శకుల పై ట్యూన్ ను కాపీ కొడుతున్నారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అన్న పేరు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ కి మాత్రం ఇప్పటి వరకు అటువంటి పేరు రాలేదు. ఆలా సంగీత దర్శకుడు అయినా పాట్లను పాడి అందరినీ అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: