తెలుగు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తున్న సమయంలో  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సుస్వాగతం సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన బండ్ల గణేష్ నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంజనేయులు సినిమా తో బండ్ల గణేష్ నిర్మాతగా మారాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ వద్ద అందుకున్నాడు. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే, ఇద్దరమ్మాయిలతో,  బాద్ షా, టెంపర్ వంటి పలు చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్ ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి కాస్త దూరం అయ్యాడు అని చెప్పవచ్చు.  

బండ్ల గణేష్ సినిమాల ద్వారా జనాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే ఉండేవాడు. అయితే అలా కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్ డేగల బాబ్జి అనే సినిమాతో హీరోగా జనాలను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇది వరకే చిత్ర బృందం విడుదల చేసింది. అలా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు జనాల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా తమిళ మూవీ ఒత్త సెరప్పు అళవు 7 రీమేక్ గా తెరకెక్కుతుంది. జాతీయ అవార్డును దక్కించుకున్న ఈ సినిమా ను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక పోస్టర్ ను బండ్ల గణేష్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్నట్లు బండ్లగణేష్ తెలియజేశాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: