తెలుగు ఇండస్ట్రీలో ఏటా కొన్ని వందల చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుంటాయి. చిన్న హీరో చిత్రాలు పెద్ద హీరోల చిత్రాలు అన్నమాట పక్కనుంచితే వాటిలో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఇలా పలు రకాల బ్యాక్ డ్రాప్స్ తో తెరకెక్కుతుంటాయి. వాటిలో ఫ్యాక్షన్ డ్రాప్ కూడా ఒకటి. ఫ్యాక్షన్ డ్రాప్ లో వచ్చిన అన్ని చిత్రాలు దాదాపుగా సూపర్ హిట్స్ ను అందుకున్నాయనే చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో ఇదే తరహాలో తెరకెక్కిన "రక్త చరిత్ర" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఊహించిన దానికంటే మిన్నగా రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పార్ట్ 2 కూడా తీశారు దర్శక నిర్మాతలు అదే "రక్త చరిత్ర 2". ఈ మూవీ కూడా అంచనాలకు మించి ఫలితాన్ని అందుకొని ది బెస్ట్ ఫ్యాక్షన్ డ్రాప్ మూవీగా గుర్తింపు పొందింది.

రామ్ గోపాల్ వర్మ దర్శత్వంలో రూపదిద్దుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సూర్య, ప్రియమణి, రాధిక అప్టే, సుదీప్, శత్రుఘ్న సిన్హా,  అభిమన్యు సింగ్ వంటి వారు ముఖ్య భూమికలు పోషించారు. "ప్రతికారమే పరమ సోపానం..మహాభారతం, ప్రతికారమే లోక వినాసకం.. మహాత్మా గాంధీ" అన్న రెండు విరుద్ధమైన, విభిన్నమైన స్టేట్మెంట్స్ తో వర్మ పెద్ద ప్రయోగం చేశాడనే చెప్పాలి.  చరిత్ర అనేది ఎపుడు కూడా కొత్తగా సృష్టించబడదు. సంఘటనల  వలన తిరిగి పునరావృతం అవుతుంది అంతే అని డైరెక్టర్ కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఇందులో హీరో సూర్య జైల్లోనే ఉండి తన పగని ప్రతీకారాన్ని తీర్చుకున్న వైనం కొత్తగా కనబరిచారు.

సూర్య యాక్షన్ కూడా అదిరిపోయింది. కానీ ప్రేక్షకులకు కొంచెం హింస శాతం ఎక్కువైందని మాటలొచ్చాయి. అయితే ఒక రాయలసీమ పగలు, ప్రతీకారాలను చూపించడంలో డైరెక్టర్ వర్మ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేదు. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా టార్గెట్ రీచ్ అవ్వడంతో ఫెయిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: