ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్లలో టబు కూడా ఒకరు. అందులోనూ ఈమె మన తెలుగమ్మాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిన టబు ఎన్నో బ్లాక్ బస్టర్ లను తన అకౌంట్ లో వేసుకున్నారు. గ్రీకువీరుడు అనగానే అక్కినేని నాగార్జున ఎలా అయితే గుర్తు వస్తారో ఆ పదాన్ని మనకు పరిచయం చేసిన టబు కూడా అంతే గుర్తుకు వస్తారు. కూలీ నంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఈ అందాలరాసి వరుస చిత్రాలతో అనతి కాలంలోనే ఎవరు ఊహించని స్థాయికి చేరుకుంది. నిన్నే పెళ్ళాడతా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టిన ఈ హైదరాబాదీ బామ బాలీవుడ్ లోను అగ్ర హీరోయిన్ గా రాణించారు.

మన తెలుగు నుండి బాలీవుడ్ లో జెండా పాతిన  హీరోయిన్ లలో శ్రీదేవి మరియు జయప్రద తరవాత టబు అనే చెప్పొచ్చు. ఈమె అసలు పేరు తబస్సుమ్‌.. కానీ అందరికీ టబు అని అలవాటు అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ప్రస్తుతం టబు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు. ఇటీవలే హిందీలో  "అంధాధున్‌" మూవీలో కీలక పాత్ర పోషించి మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులని షేక్ చేశారు టబు. ఇటు తెలుగులోనూ చాలా కాలం తరవాత "అలా వైకుంఠ పురంలో" సినిమాలో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఈమె కీలక పాత్ర పోషించిన "అందరివాడు" సినిమా కూడా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేయగా...అందులో తండ్రి పాత్రకి భార్యగా నటించింది అలరించారు టబు.

సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయినా టబు నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఒక సాధారణమైన గృహిణిగా టబు ఈ సినిమాలో ఎంతగానో అలరించారు. ఈ చిత్రంలో  చిరుతో టబు చేసిన "అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చేనే గుచ్చెనే" అనే సాంగ్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ పలు చిత్రాల్లో ఈమె కీలక పాత్రలకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తె ఇప్పటికీ టబు  సింగిల్ గానే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: