టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు కోటీశ్వరులు అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఈ షో మంచి ప్రేక్షకాదరణ పొందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా షో లో భాగంగా ఒక ప్రశ్నకు సమాధానం నరసింహనాయుడు సినిమా కాగా.. ఈ  సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఎన్టీఆర్. నరసింహనాయుడు సినిమా కు బి.గోపాల్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించాడని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తన జీవితంలో అది మరచిపోలేని సినిమా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.నరసింహనాయుడు సినిమాను ఊర్వశి థియేటర్లో చూశాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

 ఇక ఆ సినిమాని చూస్తున్న సమయంలో ముందు సీటును తంతే ఆ సీటు విరిగిపోయింది అని అన్నారు ఎన్టీఆర్.ఇక తాను కూచిపూడి డాన్సర్ ని అని.. సుధాకర్ గారు తనకు కూచిపూడి డాన్స్ నేర్పించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తనకు కూచిపూడి డాన్స్ నేర్పించిన సుధాకర్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారని ఆయనను కలుసుకోవడం తనకు వీలుగా లేదని ఎన్టీఆర్  పేర్కొన్నారు. తనకు కూచిపూడి నేర్పించిన గురువు సుధాకర్కు ఎన్టీఆర్ ప్రణామం పెట్టారు. ఇక తాను ఏం చదువుకున్నా తనకు నటన మాత్రమే తెలుసని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తాత గారి నాన్న గారి స్ఫూర్తితో తాను నటుడు కావాలని కలలు కన్నారని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

నటన కోసం చావడానికైనా సిద్ధం అంటూ ఎన్టీఆర్ షాపింగ్ కామెంట్లు చేశారు. ఇక ఈ షోలో ఎన్టీఆర్ కంట సెంటర్తో ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతున్నారు.షో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా కానీ హోస్టింగ్ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆయన ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా అనంతరం కమర్షియల్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ సినిమా చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతాగ్యారేజ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: