నందమూరి సింహం బాలకృష్ణ కు ఆనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా పట్టుకోవడం కష్టం. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మరొక ముఖ్యమంత్రి వియ్యంకుడుగా బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నప్పటికీ ఏనాడు తన హద్దు దాటకుండా రాజకీయ వివాదాలకు ఆరోపణలకు దూరంగా ఉన్నాడు.


బాలయ్య హీరోగా కొనసాగుతూనే తన తల్లి పేరున ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ను దేశంలోని ఉత్తమమైన హాస్పటల్ గా తీర్చిదిద్దడమే కాకుండా అనేకమంది పేదలకు వైద్యసహాయం అందేలా చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య ఆహా లో తాను హోస్ట్ చేస్తున్న అన్ ష్టాపబుల్ టాక్ షో ద్వారా తనకు రాబోతున్న సుమారు 5 కోట్ల పారితోషికాన్ని తనకు కాకుండా తన బసవతారకం ట్రస్ట్ కు ఇమ్మని బాలయ్య అరవింద్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవార్త ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.


దీపావళి నుండి ప్రారంభం కాబోతున్న ఈ రియాలిటీ షో ఓటీటీ రంగంలో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో బాలయ్య లుక్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 62 సంవత్సరాలు వయసు దాటిపోయినప్పటికీ బాలయ్యలో ఏమాత్రం ఉత్సాహం జోష్ తగ్గకుండా యంగ్ హీరోలకు షాక్ ఇచ్చే విధంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కనిపించింది.


ప్రస్తుతం టాప్ హీరోలు అంతా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులలో బాలయ్య ఓటీటీ ప్రయత్నం విజయవంతం అయితే మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ నందమూరి సింహం మరిన్ని షోలు ఓటీటీ లలో చేసే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ నందమూరి హీరో నటించిన ‘అఖండ’ రిలీజ్ కు రెడీ అయినప్పటికీ ఈమూవీని ఎప్పుడు విడుదల చేయాలో తెలియక సరైన రిలీజ్ డేట్ కోసం ఈమూవీ మేకర్స్ అనేక ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: