తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సింగర్ మనో గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకున్నారు. మను వ్యక్తిగత విషయంలోకి వెళ్తే.. మనో అసలు పేరు నాగూర్ బాబు. ఆయన సత్తెనపల్లిలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. మను తండ్రి ఆలిండియా రేడియోలో పని చేసేవారు. ఆయనకి సంగీతం మీద ఆసక్తితో నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆయన గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా వెండితెరపై నటించారు.

అయితే నాగూర్ బాబు పేరును ఇళయరాజా మనోగా మార్చినట్లు తెలిపారు. అయితే మనో అన్నయ్య తబలా వాద్యకారుడు కావడంతో ఆయనను సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళారంట. ఇక వారి ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మని చెప్పారంట చక్రవర్తి. అయితే ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు నేర్చుకున్నాడు. అంతేకాదు.. నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా ఆయన ఇప్పటికిపాతిక వేల పాటలను ఆలపించారంట.

మనో గాయకుడిగా మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమాలో పాడారు. అంతేకాదు రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం చేసి ఆయన ప్రశంసలు అందుకున్నారు. ఇక బుల్లితెర పై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం మనో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఆయన కొన్ని వేల పాటలను స్టేజ్ ప్రదర్శన చేశారు.

మనో జీవితంలో అత్యంత కీలకమైన సంఘటన ఆయన పెళ్లి. ఆయన 19 ఏళ్ళ వయసులోనే 1985లో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య జమీలా ఆమెది తెనాలి. మనో పెళ్ళికి సాక్షాత్తూ ఆయన  గురువు కె.చక్రవర్తి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వచ్చి, సాక్షి సంతకాలు చేశారంట. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలకు కూడా సినిమా రంగంపై ఆసక్తి ఉండటంతో పెద్దవాడు షకీర్ తమిళ సినిమాల్లో నటిస్తున్నాడని ఓ షోలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: