టాలీవుడ్ ని శాసిస్తున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. సినిమా ఇందస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన కష్టంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చి ..ఈ స్దాయిలో నిలవడం మాములు విషయం కాదు. దానికి వెనుక ఆయన కష్టం..ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఈయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన హీరో లు చాలా మందే ఉన్నారు. ఇక రాజకీయల కోసం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన చిరు.. మళ్లీ ఇండస్ట్రీ లోకి ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చి తన పవర్ ఏంటో అందరికి రుచి చూయించాడు.

ఇక ఆ తరువాత  వరుస సినిమాలకు కమిట్ అవుతూ..యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ..వాళ్లకు గట్టి కాంపిటీషన్ ఇస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో  ఆచార్య అనే సినిమాను కంప్లీట్ చేసిన ఈయన ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. మరోవైపు తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇక ఈ నెల 11వ తేదీ భోళా శంకర్ సినిమాని కూడా లాంఛనంగా స్టార్ట్ చేయనున్నాడు చిరు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈనెల 15వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తుంది.

కాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. రజినీకాంత్  నటించిన పెద్దన్న అనే సినిమా దీపావళి కానుకగా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ చూసిన  చిరంజీవి భోళా శంకర్ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పెద్దన్న సినిమాలో రజినీ-కీర్తి సురేష్ ఇద్దరూ అన్నా చెల్లెలు గా నటించారు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది .. ఇక అదే అన్నా చెల్లెలు కాన్సెప్టుతో  చిరంజీవి కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎక్కడ దెబ్బకొడుతుందో అని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక రజినీకాంత్ పెద్దన్న సినిమా ఎఫెక్ట్  భోళా శంకర్ మీద పడుతుందేమోనని ఆయన తీవ్రంగా భయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: