బాలీవుడ్ నుండి టాలీవుడ్ వైపుగా వచ్చిన ఈ నటుడు ఇక్కడ కూడా స్టార్ హోదాను దక్కించుకున్నారు. పాత్ర ఏదైనా సరే ఛాలెంజింగ్ తీసుకుని 100 శాతం న్యాయం చేస్తారు సోను. హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. తెలుగు లో "సూపర్" సినిమాలో హీరో నాగార్జునతో పోటీపడి నటించి ఆహా అనిపించారు. "అతడు" సినిమాలో మహేష్ కు స్నేహితుడిగా ..విలన్ గా నటించి ఒకే సినిమాలో వైవిధ్యాన్ని కనబరిచాడు. ఈ సీరియస్ నటుడు కామెడీ కూడా బాగా పండించగలడు అని రామ్ హీరోగా చేసిన "కందిరీగ" చిత్రంతో నిరూపించాడు. జులాయి, కందిరీగ, దూకుడు, చంద్రముఖి వంటి పలు సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు.
మంచి నటుడిగానే కాదు, మానవత్వం ఉన్న మంచి వ్యక్తిగా కూడా ప్రపంచానికి తెలిసేలా చేశారు. కరోనా కష్ట సమయంలో సోను సూద్ ప్రజలకు అందించిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ కొన్ని సేవాకార్యక్రమాలను అలాగే కొనసాగిస్తున్నారు. అలా అతను అడుగు పెట్టిన దగ్గరల్లా సక్సెస్ తన వెంటే నడిచింది. ఇదంతా కూడా ఆ ప్రేక్షకాభిమానులు ఆదరణ వల్లనే సాధ్యమయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి