‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాలని చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీలోని తన పాత్ర కోసం అల్లు అర్జున్ చాల కష్టపడుతున్నాడు. ఈమూవీ ‘బాహుబలి’ స్థాయిలో హిట్ కొట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ విడుదల తేదీ విషయమై కూడ అల్లు అర్జున్ కు కొన్ని వ్యూహాలు ఉన్నాయి. జనవరిలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవుతున్న పరిస్థితులలో తన మూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ప్రారంభం అవ్వక ముందే డిసెంబర్ 17న విడుదల చేసి ఈలోపే తన సత్తా చాటాలని బన్నీ ఆలోచన.
ప్లాన్ బాగానే ఉన్నప్పటికీ ఈరిలీజ్ డేట్ కు ‘పుష్ప’ ను రెడీ చేయడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం ఈమూవీ షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదని ఇంకా ఒక పాట మరికొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయవలసి ఉంది అంటున్నారు. దీనికోసం ప్రస్తుతం సుకుమార్ తన టీమ్ తో పరుగులు పెట్టిస్తున్నట్లు టాక్.ఒకవైపు ఈమూవీ ఎడిటింగ్ చూస్తూ మరొకవైపు పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేసి కేవలం నెలరోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ‘పుష్ప’ ను రెడీ పెట్టడానికి సుకుమార్ చాల కష్టపడుతున్నాడని అయితే ఈకష్టంలో ఏఒక్క చిన్న పొరపాటు జరిగినా దాని ఫలితం
‘పుష్ప’ పై వేరుగా ఉంటుందని అందువల్ల ఈమూవీ ఎడిటింగ్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా అసలకు మోసం వస్తుందని చెపుతూ గతంలో సుకుమార్ కు మహేష్ తో తీసిన ‘వన్ నేనొక్కడినే’ మూవీ అనుభవాలు రిపీట్ అయ్యే ఆస్కారం ఉంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
గతంలో సుకుమార్ మహేష్ తో ‘వన్ నేనొక్కడినే’ మూవీని తీస్తున్నప్పుడు ఈసినిమాను అప్పట్లో ఎట్టి పరిస్థితులలోను ఆసంవత్సరంలో వచ్చిన సంక్రాంతికి విడుదల చేసి తీరాలి అని అప్పట్లో మహేష్ సుకుమార్ కు ఇచ్చిన టార్గెట్ తో ఖంగారు పడి ఆమూవీ ఎడిటింగ్ విషయంలో చాల తప్పులు చేయడంతో ఆమూవీ ఫలితంలో అసలుకు మోసం వచ్చింది అంటారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ‘పుష్ప’ కు ఎదురౌతూ ఎట్టి పరిస్థితులలోను ఈమూవీని డిసెంబర్ 17న విడుదల చేసి తీరాలి అని బన్నీ ఇస్తున్న టార్గెట్స్ తో సుకుమార్ ఖంగారు పడుతున్నాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో మహేష్ చేసిన పొరపాట్లను అల్లు అర్జున్ పట్టించుకోవడం లేదా అంటూ కొందరి కామెంట్స్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి