పాటల్లో ఎన్నో రకాలు, ఎన్నో భావాలు. కానీ వాటిని ప్రేక్షకుల మనసుకు చేర్చాలంటే చక్కటి పద సమ్మేళనం అవసరం. అటువంటి పదాల సవ్వడితో ప్రజల మనసు గెలుచుకున్న రచయితలు టాలీవుడ్ లో ఎందరో ఉన్నారు. కాగా విప్లవ భావాలు వెలికిబుచ్చే కవులు అంటే మాత్రం కొందరే, వారిలో ఒకరు విప్లవ కవి గద్దర్. తెలుగు ప్రేక్షకులకు ఈయన బాగా సుపరిచితులే. మాటల బాణీతో మనసును కదిలించగల ఈ కవికి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. ఈయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు అయితే అప్పట్లో స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన గద్దర్ పార్టీకి గుర్తుగా ఈయన ఆ పేరు తీసుకోవడం జరిగినది.

ఈయన ఇక కవి మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమకారుడు కూడా, తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. బుర్ర కథను ఎంచుకుని తెలంగాణ ఉద్యమం కోసం ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం పెంచారు. ముఖ్యంగా దళితుల్ని మెల్కొల్పి వారి జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకునే వ్యక్తిగా ఈయన రచించిన పాటలు వింటే గూస్ బమ్స్ రావాల్సిందే. ఈయన రాసే పాటలలో ఎక్కువగా ప్రజలను మంచి మార్గం వైపు నడిపే విధంగా ఉంటాయి. చూడటానికి చాలా సాదా సీదాగా కనిపించే ఈ మహా కవి గొప్ప విద్యావంతుడు. హైదరాబాద్ లో తన ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు గద్దర్. ఈయన రచించిన చాలా పాటలు అవార్డులు సైతం అందుకున్నాయి.

ఈయన రచించిన 'నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..' అనే పాటకు గాను  నంది అవార్డు వచ్చింది. కానీ ఈయన ఆ అవార్డును తిరస్కరించారు. ప్రజల గుండె చప్పుడు విన్న రచయితగా గద్దర్ గుర్తింపు పొందారు. నాటక రంగంలోనూ ఈయన సుప్రసిద్ధుడు. ఆయన ఎన్నో నాటకాలలో కూడా నటించి ప్రజల్లో చైతన్యం కలిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: