తెలుగు చిత్ర పరిశ్రమ లో భారీ అంచనాల మధ్య తెర కెక్కిన సినిమా లలో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఈ క్రమం లోనే ముచ్చటగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి ప్రేక్షకు లలో ఒక రేంజి లో అంచనాలు పెరిగి పోయాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఉర్రూత లూగించింది అని చెప్పడం లో అతి శయోక్తి లేదు.


 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన అఖండ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారక క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. సినిమా లో బాలకృష్ణ ప్రగ్య జైశ్వాల్  హీరోయిన్ గా నటించింది.అయితే ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రస్తుతం భిన్నమైన టాక్ వినిపిస్తోంది. మాస్ ప్రేక్షకులు బాలయ్య అఖండ  బాగుంది అనుకుంటే మిగతా ప్రేక్షకులు మాత్రం ఆబ్బె అంటూ పెదవి విరుస్తున్నారు. ముఖ్యం గా అఖండ సినిమా లో బోయ పాటి టేకింగ్ ప్రేక్షకులకు కాస్త చిరాకు చెప్పిందట. ఎందుకంటే ఏకం గా బాలయ్య బోయపాటి చిత్రం గా చూపించారని కొంత మంది ప్రేక్షకులు  భావిస్తున్నారట. అంతేకాదు ఇక తమన్ మ్యూజిక్  విషయం లో మాత్రం తీవ్ర అసంతృప్తి చెందారట ప్రేక్షకులు. బాలయ్య సినిమాకి కావలసిన దానికంటే హై వోల్టేజ్ సంగీతాన్ని అందించాడట తమన్.  దేవిశ్రీ అయితే ఈ సినిమాకు ఇంకా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడని భావిస్తున్నారట కొంతమంది ప్రేక్షకులు. కానీ అటు తమన్ కావలసిన దానికంటే అతిగా అందించిన   మ్యూజిక్  ప్రేక్షకులకు చిరాకు తప్పిస్తాడు అంటూ కొంతమంది ప్రేక్షకులు అనుకుంటున్న మాట

మరింత సమాచారం తెలుసుకోండి: