మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పీడ్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. 72 సంవత్సరాలు వయసులో ఉన్నప్పటికీ యంగ్ నిర్మాతలతో పోటీ పడుతూ ఈ వయసులో కూడ భారీ సినిమాలను తీస్తున్నారు. ఒకవైపు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వాహణ మరొక వైపు సినిమాల నిర్మాణం ఇలా ఒక్క క్షణం కూడ ఖాళీ లేకుండా తన కాలాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నాడు.


ఈ పరిస్థితుల నేపధ్యంలో అరవింద్ ఒక రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసాడు అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. తమిళ హీరో శిoభూ హీరోగా నటించిన ‘మనాడు’ తమిళ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది. 2014లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఎడ్జి ఆఫ్ టుమారో’ ఆధారంగా నిర్మింపబడ్డ ఈమూవీ ఒక సైంటిఫిక్ మూవీ టైమ్ కాన్సెప్ట్ తో నడిచే ఈమూవీ కథలో అనేక ట్విస్ట్ లు ఉంటాయి.


ఈమూవీలో హీరో ఆ రాష్ట్రంలో జరగబోయే విధ్వంసకాండను తన మైండ్ గేమ్ తో ఎలా చెక్ పెట్టాడు అన్న విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు చాల ఆసక్తికరంగా తీసాడు. ఈమూవీ ఘన విజయం సాధించడంతో ఈమూవీ రీమేక్ రైట్స్  కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే అందరికంటే ముందుగా అరవింద్ ఈ రేస్ లో ముందుండి ఈ రీమేక్ రైట్స్ ను భారీ మొత్తాన్ని చెల్లించి పొందాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.


ఈమూవీని తెలుగులో రీమేక్ చేయడానికి ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ కు ఈ బాధ్యతను అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీలో నటించడానికి సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ లు ఇద్దరు ఆశక్తి కనపరచాడంతో వీరిద్దరిలో అరవింద్ ఎవర్ని ఎంపిక చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా అరవింద్ బాలకృష్ణతో ఒక భారీ మూవీని తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో ఇలాంటి వయసులో కూడ అరవింద్ తీస్తున్న పరుగులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: