సాధారణంగా చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు వారు చూపించే అహం కారణం కావొచ్చు, లేక ఇతర కారణాల వల్ల నిర్మాతలు, హీరోల చేత బ్యాన్ చేయబడుతున్న సంగతి విదితమే. ఇక అలనాటి చిత్ర పరిశ్రమలో జమున, వాణిశ్రీ లాంటివారు దర్శక నిర్మాతల, హీరోల చేత సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయబడ్డారు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చలామణి అయిన నయనతార, స్నేహా వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసిన సంగతి చాలా మందికి తెలీదు. అసలు ఎందుకు బ్యాన్ చేశారో ఒక్కసారి చూద్దామా.
చిత్ర పరిశ్రమలో నయనతార, స్నేహా ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్‌లుగా రాణిస్తున్నారు. ఇండస్ట్రీకి నయనతార కంటే ముందు స్నేహా ముందు అడుగుపెట్టింది. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఇండస్ట్రీలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో రాణిస్తున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో నయనతార అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు.

అయితే అప్పట్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న వీరిద్దరికీ బాలయ్యబాబు నోటీసులు పంపించారు. ఇక గతంలో వరద బాధితుల సహాయార్థం కోసం బాలకృష్ణ ఈవెంట్ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. స్టార్ నైట్ అనే కార్యక్రమమును కూడా చేపట్టారు. అయితే ఈ స్పందన అనే స్టార్ నైట్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ఇతర ప్రముఖులకు నోటీసులు పంపించారు. ఇక ఈ నోటీసులు పంపే ముందు ప్రతి ఒక్కరిని ఈ విషయం గురించి సరైన వివరణ ఇవ్వాలని తెలిపారు. ఎవరైనా వివరణ ఇవ్వకపోతే తెలుగు సినిమాలలో బ్యాన్ అవుతారని చెప్పగా.. ఈ కార్యక్రమానికి స్నేహా, నయనతార హాజరు కాలేదంట. దీంతో వారిని బాలయ్య బాబు బ్యాన్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: