మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్  సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి మంచి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.  అయితే రవితేజ ఆఫ్ ఆమ్లా అలాగే కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం తో  ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇదివరకే తెలియజేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఈ సినిమాతో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

 ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను ఇప్పటికే చిత్ర బృందం విడుదలైన వీటికి జనాల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుబోతున్న రావణాసుర సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రవితేజ ముగ్గురు హీరోయిన్ లతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక లేడి విలన్ కూడా ఉండబోతుందట. ఈ సినిమాతో పాటు రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రవితేజ నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: