తెలుగువారు ఎంతగానో ఇష్టపడే ఏకైక తెలుగు ఓటిటీ సంస్థ ఆహా. ఇప్పుడు ఎక్స్ ప్యాన్సన్ దిశగా ముందుకు వెళుతుంది ఈ ప్రతిష్టాత్మక ఓ టీ టీ సంస్థ. తెలుగునాట ఎలాంటి ఓ టీ టీ సంస్థ లేని వేళ వారందరి వినోదాన్ని కోసం తాను ఉన్నాను అంటూ ఈ ఆహా సంస్థ అవతరించింది. అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఈ సంస్థ తెలుగువారందరినీ మెప్పించే షోలతో సినిమాలతో ఇప్పటివరకు ముందుకు వెళ్ళింది. 

ప్రేక్షకులను అలరించే ఎన్నో వినోద కార్యక్రమాలను ఏర్పరిచి గతంలో బుల్లి తెరపై కనిపించనీ హీరో లను హీరోయిన్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ప్రేక్షకులను కనువిందు చేసిన ఈ ఆహా ఇప్పుడు తమిళంలోనూ ఏర్పడే విధంగా ముందుకు వెళుతుంది. నిజమే ఆహా ఇప్పుడు తమిళంలో కూడా రాబోతున్నట్లూ సమాచారం అందుతుంది.  మొదట్లో ఈ ఓ టీ టీ సంస్థ ఏర్పడినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. పెద్ద పెద్ద ఓ టీ టీ సంస్థలకు వీలు పడటం లేదు చిన్న ఓ టీ టీ సంస్థ కు ఏవిధంగా పోటీలో తట్టుకుంటుందో అని ఎంతోమంది అవమానించారు.

అంతే కాదు దానికి తగ్గట్లే ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఆహా పట్ల చిన్నచూపు చూస్తూ దానినీ తొక్కేసే విధంగా ఎన్నో ప్రణాళికలు వేశాయి. కానీ వాటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు ఇంతటి స్థాయిలో ముందుకు వచ్చింది అంటే నిజంగా దీనికి సంబంధించిన వారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులను మాత్రమే ఆలరించే విధంగా వారిని మాత్రమే ఆనంద పరచడమే ధ్యేయం గా ఈ ఆహా ముందుకు వెళ్లి ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆహ్లాద పరిచింది.  ఆ విధంగా ఇప్పుడు తమిళంలో కూడా రాబోతున్న ఈ ఆహా ఓ టీ టీ అక్కడివారిని ఈ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. క్వాలిటీ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా ఉండే ఆహా ఇప్పుడు తమిళంలో ఎలాంటి జోరు చూపించి అక్కడి వారిని ఆకట్టుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

aha