సాధారణంగా బిగ్ బాస్ షో కి అందరు వెళ్ళాలి అనుకునేది పాపులారిటీ కోసం..అంత పెద్ద షో ద్వారా తమను తాము ప్రూవ్ చేసుకుంటే మంచి మంచి ఆఫర్లు వస్తాయి అనుకుని..బిగ్ బాస్ యాజమాన్యం నుండి కాల్ రాగానే ఓకే చెప్పేస్తారు. ఇక కొందరు అయితే బిగ్ బాస్ లోకి వెళ్లితే డబ్బుకు డబ్బు పేరుకి పేరు ..ఒక్కే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు బిగ్ బాస్ షోలోకి వెళ్లిపోతారు. కానీ హౌస్ లోపలికి వెళ్లాక కధ వేరేలా ఉంటాది. అన్నీ మనం అనుకున్నంత సులువుగా ఉండవు. ఈ క్రమంలోనే చాలా మంది మంచి పేరుతో లోపలికి వెళ్ళి చెడ్డ పేరుతో బయటకి వచ్చారు.

ఇక అలాంటి వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఈయన కు ఎలాంటి పేరు ఉంది. బయటకు వచ్చక ఎలాంటి పేరు ఉందనేది మనకు తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో తన తోటి హౌస్ మెట్ సిరితో చేసిన పని తీరు నచ్చక ప్రాణంగా ఐదేళ్లు ప్రేమించిన ప్రియుడిని వద్దు అనుకుంది  దీప్తి. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ గా మారింది. యూట్యూబ్ లో ఎక్కడ చూసిన ..ఎవరి నోట విన్న వీళ్ల బ్రేకప్ గురించే చర్చలు. దీంతో జనాలకు విసుకువచ్చేసింది. యూట్యూబ్ ఓపెన్ చేయడమే మానేసారు.

ఇక రీసెంట్ గానే షన్నూ ఫాదర్.." షణ్ముఖ్-దీప్తి ఖచ్చితంగా మళ్లీ కలుస్తారు. అభిమానులు బాధపడకండి" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్న టైంలోనే మళ్ళీ సిరి షణ్ముఖ్-దీప్తి మ్యాటర్ లో ఫింగర్ పెట్టి.."వాళ్లు  ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్..నా వల్ల వాళ్లు విడిపోలేదు. అయినా వాళ్లది 100 రోజుల్లోనే విడిపోయే అంతా వీక్ లవ్ కాదు" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు ఫ్యాన్స్ సిరి పై మండిపడుతున్నారు. మళ్లీ షణ్ముఖ్-దీప్తి ల మ్యాటర్ లో వేళ్లు పెట్టకు తల్లి ..వాళ్లని హ్యాపీగా బ్రతకనివ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్స్ అయితే.."నీ వల్లే వాళ్ళు విడిపోయారు..వాళ్లకు నువ్వు దూరంగా ఉంటేనే మంచిది" అంటూ చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: