తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంతకాలంగా నెలకొన్న వివాదానికి తెరదించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఓ సినిమా పెద్దగా కాకుండా.. సినిమా బిడ్డగా.. అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు చిరు. థియేటర్ల మూసివేత, టికెట్ ధరలు తదితర అంశాలపై పరిష్కరించడం లో భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు. అయితే వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడంపై కొంత దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఓ వైపు ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ సంప్రదింపులు పై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే..

మరోవైపు మాత్రం వైసిపి పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. కాగా ఇప్పటికే జగన్ తో చిరంజీవి భేటీ పై అక్కినేని నాగార్జున స్పందించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలోని అందరి కోసమే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారి తో సమావేశం అవుతున్నారని.. బంగార్రాజు సినిమా విడుదల వల్ల తాను ఆ సమావేశానికి వెళ్ళలేకపోయాయని అన్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు తాజాగా ఇదే బంగార్రాజు ప్రమోషన్స్ లో మరోసారి ఇదే విషయం పై నాగార్జున స్పందించారు. చిరంజీవి వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ సమస్యలకు ఒక పులిస్టాప్ పడుతుందన్నారు.

టికెట్ రేట్లు థియేటర్ల మూసివేత తదితర సమస్యలు అన్నింటికీ త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ వర్గాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు హీరోలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.దీంతో మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలిసి ఇండస్ట్రీ సమస్యలన్నింటినీ ఓ కొలిక్కి వచ్చే ప్రయత్నం చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: