కన్నడ భామ రష్మిక ప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమని ఏలేస్తుందని చెప్పొచ్చు. ఆమె చేస్తున్న సినిమాలన్ని సూపర్ హిట్ అవుతుండటంతో రష్మిక తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలో రష్మిక వెంట దర్శక నిర్మాతలే కాదు ప్రముఖ వాణిజ్య సంస్థలు వెంట పడుతున్నాయి. ఫాం లో ఉన్న రష్మిక ఇప్పటికే చాలా ప్రకటనలను.. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో అమ్మడికి మరో బ్రాండ్ వచ్చి చేరిందని తెలుస్తుంది.

రీసెంట్ గానే చేస్తున్న బ్రాండింగ్ తో పాటుగా ఖజానా జెవెలరీ కి బ్రాండింగ్ చేస్తున్న రష్మిక మందన్న కొత్తగా మరో వాణిజ్య సంస్థకి సైన్ చేసింది. అదే ప్రముఖ హనీ బ్రాండ్ డాబర్. డాబర్ హనీకి బ్రాండింగ్ చేస్తుంది రష్మిక మందన్న. సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటన్లతో కూడా వేరే హీరోయిన్స్ కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోతుంది శ్రీవల్లి. ఓ పక్క చేస్తున్న సినిమాల ఫలితాలు అదరగొడుతుంటే ఇప్పుడు అమ్మడి ఖాతాలో వరుసగా బ్రాండ్ లు వచ్చి చేరుతున్నాయి.

ఇప్పటికే ఐదారు బ్రాండ్ లకు ప్రకటనలు చేస్తున్న రష్నిక లేటెస్ట్ గా డాబర్ హనీ కోసం కూడా బ్రాండింగ్ చేస్తుంది. రష్మిక ప్రమోషన్స్ ఆ బ్రాండ్ కి మరింత సేల్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఆఫర్లు అందుకుంటున్న కన్నడ కుట్టి రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. అమ్మడు మిషన్ మజ్ ను.. గుడ్ బై సినిమాల్లో నటిస్తుంది. రెండు క్రేజీ ప్రాజెక్టులు అవడంతో బాలీవుడ్ లో కూడా రష్మిక చక్రం తిప్పడం ఖాయమని చెప్పొచ్చు. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు రానున్న సినిమాలతో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్నిచోట్ల అదరగొట్టేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: