మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై ఎంతో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని కొరటాల శివ తీస్తుండగా ఇందులో మెగాస్టార్ ఆచార్య అనే నక్సలైట్ గా కనిపించనుండగా ఆయన అనుచరుడైన సిద్ద పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

యువ భామలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాని దేవాలయాల భూముల్లో జరుగుతున్న అక్రమాలు, దుర్మార్గాలను నేపధ్యంగా చేసుకుని సాగే మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవల షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే విషయం ఏమిటంటే, కొన్నాళ్ల నుండి వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న సిద్ద పాత్ర సినిమా సెకండ్ హాఫ్ లో చనిపోతుందని వార్తలు వచ్చాయి.

అయితే అది మాత్రమే కాక నేడు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న మరొక న్యూస్ ప్రకారం ఆయనకి జోడీగా సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే పాత్ర కూడా చనిపోతుందట. సిద్ద ని ప్రేమించే నీలాంబరి అనే గిరిజన యువతిగా పూజా ఈ సినిమాలో కనిపించనున్నారని, కథ రీత్యా ఈ రెండు పాత్రలు చనిపోయిన తరువాత సినిమా మరొక మలుపు తిరుగుతుందని ఇన్నర్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలు ప్రకారం ఆచార్య లో చరణ్, పూజాల పాత్రలు నిజంగానే చనిపోతాయా లేదా అనేది పక్కాగా తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. కాగా ఆచార్య మూవీ ఏప్రిల్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: