ఈటీవీ లో వచ్చే ఢీ షో మెంటర్ గా వర్షిణి బాగా పాపులర్ అయ్యింది. అంతకుముందు పటాస్ షోతో పాపులర్ అయిన ఈ భామ అంతకుముందు సినిమాల్లో ప్రయత్నాలు చేసినా లక్ కలిసి రాలేదు. మాస్ మహరాజ్ రవితేజ శంబో శివ శంబో సినిమా తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు చందమామ కథలు సినిమాతో అలరించింది. అప్పటి నుండి సినిమలు చేస్తూనే బుల్లితెర మీద సందడి చేస్తుంది.

హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవాల్సిన ఈ భామ యాంకర్ గా మారే సరికి స్మాల్ స్క్రీన్ మీద కూడా అమ్మడు అందాలను గుమ్మరించడంలో ఏమాత్రం తగ్గదు. సినిమాలు చేయకపోయిన వెబ్ సీరీస్ లతో కూడా కెరియర్ బిజీగా చేసుకుంది. గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని వర్షిణి లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం లో మరోసారి రెచ్చిపోయింది. నాభి అందాలు చూపిస్తూ అమ్మడు చేస్తున్న ఈ రెచ్చ మాములుగా లేదని చెప్పొచ్చు.

గ్లామార్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎంత గ్లామర్ షో చేస్తే అంత క్రేజ్ వస్తుంది. అలాగని అందరు అదే పద్ధతిని ఫాలో అవరు. కొందరు కేవలం తమ అభినయంతోనే మెప్పిస్తారు. ఈ క్రమంలో వర్షిణి మాత్రం అందాలను ప్రదర్శించడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంది. బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో ఆమె ఎంట్రీ కన్ ఫర్మ్ అని చెప్పుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5లోనే వర్షిణి పేరు వినపడగా ఇప్పుడు అమ్మడు బిగ్ బాస్ ఓటీటీ కోసం రెడీ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ మాలో స్పెషల్ ప్రోగ్రాంస్ కు యాంకర్ గా చేస్తున్న వర్షిణి తన లేటెస్ట్ హాట్ పిక్స్ తో అలరిస్తుంది. మరి ఇంత చేస్తున్న అమ్మడి కష్టాన్ని గుర్తించాల్సిందే అంటున్నారు. తనలో ఉన్న టాలెంట్ ఇప్పటికైనా గుర్తించి అమ్మడికి హీరోయిన్ గా సినిమాలు ఛాన్సులు రావాలని వర్షిణి ఫ్యాన్స్ కోరుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: