టాలీవుడ్ సినీయర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున్న 'ఎఫ్3' సినిమా విడుదలకు అసలు టైం కలిసి రావడం లేదు. మొదట ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సంక్రాంతికి త్రిబుల్ ఆర్ విడుదల అవుతుండటంతో ఈ సినిమాను ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. ఆ తర్వాత ఆ సమయంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. దాంతో ఈ సినిమాను మళ్ళీ ఏప్రిల్ 28 కి విడుదల తేదీ ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా రాజమౌళి త్రిబుల్ ఆర్ ఏప్రిల్ 28 న విడుదల కావచ్చని ఆ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి ఎఫ్ 3 పోస్ట్ పోన్ చేయడం ఖాయం అని అంటున్నాయి సినీవర్గాలు. 

దీంతో మరోసారి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా వల్ల ఓసారి రిలీజ్ డేట్ ని పోస్ట్ ఫోన్ చేసుకున్న f3.. సినిమాకి ఇప్పుడు త్రిబుల్ ఆర్ మరోసారి అడ్డంకిగా మారింది. మొత్తంమీద మరోసారి తన సినిమా వాయిదా పడుతుందని ఊహాగానాలు తనకు కూడా వస్తున్నాయని ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి హింట్ ఇస్తూ వస్తున్నాడు. ఇక మరోవైపు ఈ సినిమాని జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేసినా.. ఇంకా విడుదలకు మాత్రం నోచుకోలేక పోతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి మూడేళ్లు కేటాయించాడు.

ఈసారి పక్కా ప్లాన్ తోనే ఎఫ్2 ని మించిన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ దర్శకుడు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఈ సినిమా ఎప్పుడో విడుదల అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి అన్ని తారుమారు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా ఎఫ్3 రిలీజ్ కు అడ్డు పడుతూ వస్తోంది. మొత్తం మీద ఎఫ్ త్రీ సినిమా సినిమా ఏప్రిల్ 28 న విడుదల అవుతుందా? లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది త్వరలోనే తేలనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: