హిందీ 'అల వైకుంఠపురము'పై కన్ఫ్యూజన్ వీడింది. అల్లు అరవింద్‌ ప్రాజెక్ట్‌లో ఉండి కూడా ఎందుకు ఇలాంటి అనౌన్స్‌మెంట్‌ వచ్చిందనే సందేహాలకు సమాధానం దొరికింది. ఎండకాలం తుఫాన్‌లా సడన్‌గా వచ్చిన అనౌన్స్‌మెంట్ అంతే సడన్‌గా వెనక్కి వెళ్లిపోయింది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్‌ ఆపేస్తున్నామని ప్రకటించారు నిర్మాతలు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా తెలుగుతో పాటు హిందీబెల్ట్‌లో కూడా భారీగా వసూల్ చేసింది. '83, చండీఘడ్ కరే ఆషికీ' లాంటి సినిమాలకి పోటీ ఇచ్చి నార్త్‌లో 70 కోట్లవరకు కలెక్ట్ చేసింది పుష్ప. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్నీ, నైట్‌ కర్ఫ్యూల టైమ్‌లో కూడా భారీగా వసూల్ చేసి హిందీ మార్కెట్‌ విశ్లేషకులని కూడా ఆశ్చర్యపరిచింది.

'పుష్ప'కి మాస్‌ సెంటర్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ప్రీవియస్ మూవీ 'అల వైకుంఠపురములో' సినిమాని హిందీలో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్ చేశాడు గోల్డ్ మైన్స్‌ సంస్థ ప్రమోటర్ మనీష్ షా. జనవరి 28న 'అల వైకుంఠపురములో' హిందీ వెర్షన్‌ని 2000కి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది గోల్డ్‌మైన్స్ సంస్థ. అయితే ఇప్పుడు 'షెహజాదే' టీమ్‌తో జరిగిన చర్చలతో హిందీ వైకుంఠపురాన్ని హార్డ్ డిస్కులకే పరిమితం చేసింది.

అల్లు అరవింద్, భూషణ్‌ కుమార్, ఆమన్ గిల్‌ సంయుక్త నిర్మాణంలో 'అలవైకుంఠపురము' హిందీ రీమేక్ మొదలైంది. రోహిత్ ధావన్‌ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్‌ లీడ్‌ రోల్స్‌లో ఈ సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఒకపక్క రీమేక్‌ జరుగుతోంటే మరోపక్క హిందీ డబ్బింగ్ రిలీజ్ చెయ్యడమేంటి.. తెలుగులో నిర్మాణ భాగస్వామిగా ఉన్న అరవింద్‌, హిందీలోనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అయినా డబ్బింగ్‌ ఏంటి.. కొంపదీసి 'షెహజాదే' సినిమాని ఆపేసారా అని అనుమానించారు బాలీవుడ్ జనాలు.

'అల వైకుంఠపురము' హిందీ డబ్బింగ్ రిలీజ్‌ ప్రకటన రాగానే భూషణ్ కుమార్, ఆమన్ గిల్‌ రంగంలోకి దిగారు. డబ్బింగ్‌ సినిమా రిలీజైతే, రీమేక్‌ మూవీ ఎఫెక్ట్ అవుతుందని మనీష్ షాతో చర్చలు జరిపారు. ఇక ఈ డీల్‌తో గోల్డ్‌మైన్స్ సంస్థ వెనక్కి తగ్గింది. దీంతో 'అల వైకుంఠపురములో' రీమేక్‌ మళ్లీ సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: