నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఏ రేంజ్ సక్సెస్ లో ఉన్నాడో మన అందరికీ తెలిసిందే,  ఇప్పటికే తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సక్సెస్ అవడంతో లో ఫుల్ జోష్ లో ఉన్నాడు.  బాలకృష్ణ అఖండ సినిమా కంటే ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొన్నడు, అలా బాక్స్ ఆఫీస్ బాలకృష్ణకు వరుస అపజయాలు ఎదురవుతున్న సమయంలో బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బాలకృష్ణకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని తీసుకువచ్చింది.  

ఇలా అఖండ సినిమా విజయం సాధించడం అదే సమయంలో బాలకృష్ణ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ షో కు హోస్ట్ గా  వ్యవహరించాడు,  అలాగే ఈ టాక్ షో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.  ఇది ఇలా ఉంటే అఖండ సినిమా సక్సెస్ కావడం, ఆన్ స్టాపబుల్ టాక్ షో సక్సెస్ కావడంతో ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, ఇలా ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ,  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు,  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం గోపిచంద్ ఉన్నట్లు తెలుస్తుంది,  అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది నటీనటులకు కూడా చిత్ర బృందం ఫైనల్ చేసింది. ఇదిలా ఉంటే బాలకృష్ణసినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు,  ప్రస్తుతం ఎఫ్ త్రీ సినిమా పనుల్లో  అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు, ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది,  ఆ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ సినిమాపై అనిల్ రావిపూడి ఫోకస్  పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది,  ఇలా అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజీ  సినిమాలను  లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: