మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో ఆయన చేస్తున్న భారీ చిత్రం భోళా శంకర్ సినిమా మెగా స్టార్ నటిస్తున్న క్రేజీ సినిమాలలో ఒకటి. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్న శివరాత్రి సందర్భంగా విడుదల కాగా అది చూసిన మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి నీ పాత రోజులలో ఏ విధంగా అయితే చూశానో ఇప్పుడు కూడా అదే విధంగా చూడబోతున్నామని ఎంతో సంబరపడుతున్నారు.

 యాక్షన్ ఎంటర్టైనర్ గా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించడం అనేది ఇప్పటికీ కొంతమందికి మింగుడు పడడం లేదు. కానీ ప్రస్తుతం విడుదల అవుతున్న అప్డేట్స్ నీ బట్టి తెలుస్తుంది ఏమిటంటే మెహర్ రమేష్ గతంలోలా కాదు ఇప్పుడు చాలా మారాదు అని అంటున్నారు. లుక్ లో చిరు డ్రెస్సింగ్ దగ్గరనుంచి కూర్చునే పొజిషన్ వరకు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంతో బాగా ప్లాన్ చేసి డిజైన్ చేసి చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా లో ఒక రేంజ్ లో ఆయనను ఆవిష్కరించబోతున్నారు అని అర్థమవుతుంది

ఈ నేపథ్యంలో ఆయన ఆల్ట్రా స్టైలిష్ లో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని చెప్పవచ్చు.ఇక పోతే మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పోస్టర్ యొక్క నేపథ్యాన్ని ఎలివేట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. భారీ ఎలివేషన్ ఇస్తూ మెహర్ రమేష్ చిత్రీకరించిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి సోదరి గా నటిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. మరి తమిళంలో సూపర్ హిట్ అయిన విధంగా ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా అనేది చూడాలి. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను అతి తక్కువ సమయంలోనే విడుదల చేయబోతున్నాడు చిరంజీవి. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: