పునీత్ రాజ్కుమార్ లాంటి ఒక సూపర్ స్టార్ ఒక మనసున్న మనిషి పేద ప్రజలకు ఆపదలో ఆదుకునే దేవుడు...  హఠాత్ మరణం ఎంతోమందిని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. గత ఏడాది గుండెపోటు కారణంగా పునీత్ రాజ్కుమార్ మరణించాడు అన్న విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితేపునీత్ రాజ్కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు సైతం ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు అన్న విషయం తెలిసిందే. కేవలం కోలీవుడ్ ప్రముఖులే కాదు టాలీవుడ్ బాలీవుడ్ కి చెందిన నటీనటులు అందరు కూడా పునీత్ రాజ్కుమార్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇక పూనీత్ ఎంత గొప్ప వ్యక్తి అన్న విషయాన్ని చెప్పారు.



 పునీత్ రాజ్కుమార్ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ఎన్నో సార్లు పునీత్ భార్య ఆయన లేరు అన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను అంటూ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా పునీత్ రాజ్కుమార్ హఠాత్ మరణం చెందారు అన్న విషయం పూనీత్ మేనత్త నాగమ్మకు తెలియదట. ఈ విషయాన్ని ఎవరో కాదు ఏకంగా పునీత్ కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.. అయితే పునీత్ తండ్రి రాజ్కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో రాజ్ కుమార్ అక్క నాగమ్మ షాక్ లోకి వెళ్లి ఆసుపత్రి పాలయ్యారు.


 ఇక ఇప్పుడు ఆమెకి తొంభై ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక తనకు ఎంతో ఇష్టమైన పునీత్ రాజ్కుమార్ లేడు అన్న విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడి ఈ విషయాన్ని ఇప్పటికీ ఆమెకు తెలియకుండా రహస్యంగానే ఉంచారట కుటుంబ సభ్యులు. పప్పు ఎక్కడికి వెళ్ళాడు నన్ను కలవడానికి రావడం లేదు అని అడుగుతే పునీత్ ఇక లేడు అన్న విషయాన్ని చెప్పలేక గుండె తరుక్కుపోతుందట. ఇక ఆమె అడిగినప్పుడల్లా అవుట్డోర్ షూటింగ్ లకి వెళ్ళాడు.. బిజీగా ఉన్నాడు అంటూ చెబుతూవస్తున్నారట పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులు..

మరింత సమాచారం తెలుసుకోండి: