సంవత్సరాలు కాస్త  నెలలుగా మారిపోయాయి. నెలలు కాస్త రోజులుగా మారాయి. రోజులు కాస్త ఇక ఇప్పుడు గంటల్లో కి చేరుకున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఇలా లెక్కలు వేసుకుంటూ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతమైన కళాఖండం ఎలా ఉండబోతుందో అది చూసి తరించేందుకు ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ కూడా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉన్నారు. మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కాబోతుంది అనే విషయం తెలిసిందే.


 కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర సమరయోధులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తుండగా శ్రియ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.  ఇటీవలే ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు రాజమౌలీ.


 ఈ సినిమాలో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు హీరోల ఎంట్రీ ఉంటుంది.ఎమోషన్స్ బాగుంటాయి. మళ్లీ మళ్లీ సినిమా చూడాలనిపిస్తుంది అంటు రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త మొత్తం వైరల్ గా మారిపోయింది. సెకండాఫ్ కంటే ఫస్టాప్ నిడివి ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా తెలుగు వర్షన్ సినిమాలు 180 రెండు నిమిషాలు ఉంటాయి అంటే మూడు గంటల పై మాటే. అయితే త్రిబుల్ ఆర్ ఫస్ట్ ఆఫ్ 100 నిమిషాలు రన్ టైం ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ ఎనభై రెండు నిమిషాలు ఉంటుందట. ఇక టాలీవుడ్ లో మొదటి సారి ఇలా జరిగిందని ఇదిరికార్డు అని అంటున్నారు సినీ విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr