ప్రాంతీయతత్వం ఎక్కువగా కనపడే ఇండియన్ సినిమాలు తప్పకుండా మన ప్రాంతం వారికి నచ్చుతాయి.ఎందుకంటే ఎవరి ప్రాంతీయత కు వారు అలవాటు పడి ఉంటారు కాబట్టి. అలాంటిది ఒక తెలుగు సినిమా యూఎస్లో విడుదల అవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు అక్కడి ప్రేక్షకులు కూడా మన తెలుగు సినిమా కోసం ఎదురు చూసే అంత స్థాయికి ఎదగడం నిజంగా గర్వకారణం. అంతే కాదు అక్కడ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లిస్టులో కూడా స్థానం సంపాదించుకోవడం మనం చూస్తున్నాం.
గత 15 ఏళ్లుగా జరిగిన మార్పులలో ఇది ఒకటి. ఐదేళ్ల కిందట బాహుబలి సినిమా సృష్టించిన ప్రభంజనం ఈ విధంగా మార్పుల జరగడానికి ముఖ్య కారణం గా నిలిచింది.
బాహుబలి సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 20 మిలియన్ల డాలర్లను వసూలు చేసి హాలీవుడ్ ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ విధంగా మళ్లీ అదే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలాంటి రికార్డులను కొడుతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా దానికి మించిన స్థాయిలో యూఎస్ బాక్సాఫీసు కలెక్షన్ లను చేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా కేవలం మూడు మిలియన్లకు పైగా సంపాదించి ముందుకు వెళుతు ఉండగా ఈ సినిమాను చూసి టాలీవుడ్ సైతం ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాదు ఈ వారాంతంలోనే బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ జాబితాలోకి ఈ సినిమా చేరడం ఖాయం అని వారే చెబుతున్నారు. చెప్పుకోదగ్గ స్థాయి లో లేకపోయినప్పటికీ ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ లో అగ్రస్థానంలో నిలవడం అసాధారణమైన విషయం. మొదటి రోజు వచ్చిన టాక్ ను చూస్తే తప్పకుండా ఈ వీకెండ్లో పది మిలియన్ మార్పుకు చేరువగా వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా ఫుల్ రన్లో బాహుబలి రికార్డులు కూడా దాటే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇదే జోరును కొనసాగిస్తే ఇదే నిజం అవుతుంది కూడా. ఏదైతేనేమి తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులను అలరించడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి