నాగ చైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు 2 సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ దూకుడు పెంచారు. కాగా ప్రస్తుతం చైతు తన లైఫ్ లో సామ్ పార్ట్ గురించి పూర్తిగా మరిచిపోయారు అని మరో అమ్మాయిని తన జీవితం లోకి ఆహ్వానించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రెజెంటర్ టాలీవుడ్ లో చైతు సెకండ్ మ్యారేజ్ గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. చైతు రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న విషయం నిజమే అని సమాచారం. తండ్రి నాగార్జున చెప్పడంతో సరే అన్నారని అంటున్నారు. అయితే ఈ సారి చైతు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఇండస్ట్రీకి సంబందించిన అమ్మాయి కాదని సమాచారం. మొదటి సారి సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య ఈ సారి తన లైఫ్ పార్టనర్ విషయాన్ని పూర్తిగా తండ్రి నాగార్జున నిర్ణయానికే వదిలేశారట.
దాంతో నాగ్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ గారి తరపున ఒక అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు చైతు కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ అమ్మాయికి ఒక సోదరి కూడా ఉందని కుదిరితే ఆ అమ్మాయిని అఖిల్ కి ఇచ్చి ఒకే సారి రెండు పెళ్లిళ్లు చేయాలని అనుకుంటోందట అక్కినేని ఫ్యామిలీ. మరి ఈ విషయం గురించి ఒక క్లారిటీ రావాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.