ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటూన్నారు. యాక్షన్ కోసం కొత్త విద్యలను కూడా పవన్ నేర్చుకోవాలని అనుకున్నారు. దాంతో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడూ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం.రత్నం నిర్మాత. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేకమైన సెట్లు తీర్చిదిద్దారు.. ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లొ పర్యటించాలని షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే..
ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తుంది.సింహభాగం షూటింగ్ జరుగుతోంది. స్వల్ప విరామం తరవాత సోమవారం పవన్ కల్యాణ్ మళ్లీ సెట్లో అడుగుపెట్టారు. పవన్ కల్యాణ్, ఇతర కీలక పాత్ర ధారుల మధ్య ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ జులై వరకూ సుదీర్ఘంగా సాగుతుంది. మధ్య మధ్యలో ఒకట్రెండు రోజులు స్వల్ప విరామం తప్ప షూటింగ్ కు బ్రెకులు లేవని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారని సమాచారం.. మరి సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసింది.. మంచి హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి