తెలుగులో మల్టిస్టారర్ సినిమాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..కొన్ని సినిమాలు ప్లాప్ అయిన కూడా చాలా మంది మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను అందుకుంది..ఇదే తరహాలోనే స్టార్ హీరోలు మల్టిస్టారర్ సినిమాలను చేస్తున్నారు..ఇప్పుడు మెగా హీరోలు చేసిన మల్టీస్టారర్ సినిమా ఆచార్య..ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి లు ప్రధాన నటిస్తున్నారు.


ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరగగా సినిమా రిలీజ్ కి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది.కాగా, సినిమాను జనాల్లోకి తీసుకెల్లాలని పలు మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.తాజాగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్, కొరటాల శివ పాల్గొనగా హరీష్ శంకర్ అడిగిన పలు ప్రశ్నలకి ఆసక్తికర విషయాలను జనాలకు తెలిపారు.


ఈ మేరకు డైరెక్టర్ హరీష్ ఒక ప్రశ్న అడిగారు.. చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తీస్తే బాగుంటుంది, ఆ రోల్ లో ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అని అడగగా దీనికి సమాధానంగా చిరంజీవి..నాకు తెలిసి చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్ లో బన్నీ చేయగలడు. బన్నీ బేసిక్ గా మిమిక్ కూడా. అన్ని కామెడీ వాయిస్ లు బాగా చేస్తాడు. మిమిక్రీతో నవ్విస్తాడు కూడా అని బన్నీ సీక్రెట్స్ ను చిరు బయట పెట్టారు.. ఆ విషయం విన్న బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. బన్నీ ఆ సినిమాను చేస్తారా..లేదా అన్నది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: