ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా .ఖడ్గం మూవీ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రవితేజ చెప్పే డైలాగ్ ఇది. అందరి కి తెలుసు.


ఇదే డైలాగ్ అప్లై చేసిందేమో తెలియదు కానీ..ఈ ఢిల్లీ బ్యూటీ కి ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసినట్లుంది.ఆ ఒకే ఒక్క ఛాన్స్ ఇపుడు ఆమె కెరీర్‌ను టర్న్ చేసిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందట.. ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నది అనుకుంటున్నారా..? అశోక వనంలో అర్జుణ కల్యాణం సెకండ్ ఫీ మేల్ లీడ్ పోషించిన రితికానాయక్ గురించి..


అవును ఈ సినిమాలో ఎవరూ ఊహించిన విధంగా మెయిన్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్‌కు కూడా రాని స్పందన రితికా నాయక్ సీన్లకు వస్తుంటుందట.రితికా కనిపించిన ప్రతీసారి సిల్వర్ స్క్రీన్‌పై ఏదో మాయ చేస్తున్నదా..? అన్నట్టనిపిస్తుందట.మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసి..అగ్ర నిర్మాత ల దృష్టిని ఆకర్షించిందట రితికానాయక్‌. ఒకప్పుడు తొలి ప్రాజెక్టు హ్యాపీడేస్ సినిమా తర్వాత తమన్నాకు మూడు సినిమాల ఆఫర్ వచ్చినట్టుగా నే రితికా కు కూడా అలాంటి జాక్‌పాట్ ఆఫరే వచ్చినట్లు సమాచారం.


మెగా బ్యానర్ గీతాఆర్ట్స్  నుంచి మూడు సినిమాల డీల్  కుదిరిందని చెప్పుకొచ్చింది రితికానాయక్‌. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా పెద్ద మొత్తంలోనే ఇచ్చేందుకు గీతాఆర్ట్స్ రెడీ అయిందని సమాచారం.. గీతాఆర్ట్స్ లో ఇలాంటి డీల్ కుదిరిందంటే సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి మరి.. మొత్తానికి ఒక్క సినిమా రితికా నాయక్‌ జీవితాన్ని మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.


రితికా నాయక్ తన క్యూట్ లుక్స్ తో అందరి ని బాగా ఆకట్టుకుంది.తన అందం తో అందరిని మాయ చేసింది. రానున్న రోజుల్లో స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: