యాంకర్ సుమ.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. కాని చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకు అంటారా దాదాపు యాంకర్ సుమ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా తెలుసు అని చెప్పాలి. తెలుగు బుల్లితెరపై మకుటంలేని  మహారాణిగా సుమా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. దశాబ్ద కాలం నుంచి ఇక తెలుగులో టాప్ యాంకర్గా కొనసాగుతోంది. తన వాక్చాతుర్యంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం బుల్లితెర కార్యక్రమాలతో సరిపెట్టుకోకుండా అటు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కి హోస్టింగ్ కూడా చేస్తూ అదరగొడుతోంది.


 ఎవరైనా స్టార్ హీరో సినిమా తెరమీదికి వచ్చింది అంటే ఆ సినిమాకు సంబంధించిన అన్ని ఫంక్షన్స్ లో  సుమ దర్శనమిస్తూ వుంటుంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమా ఫంక్షన్స్ కోసం అటు సుమ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా యాంకర్ సుమ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయింది అని చెప్పాలి. అయితే సుమా అందరితో అక్క అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్ట పడుతూ ఉంటుంది. ఎవరైనా ఆంటీ అంటే అక్క అని పిలువు అని చెప్పి మరి పిలిపించుకుంటుంది.



 అలాంటి సుమ వయసు గురించి బయటపెట్టి ఇటీవల హీరో అడవి శేషు ఏకంగా స్టేజి మీద పరువు తీసేసాడు. మేజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో ఎంట్రీ ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ గారు అంటే అందరికీ క్రష్ ఉంటుంది నాకు కూడా అలాంటి క్రష్ ఉంది అంటూ అడవి శేషు చెప్పుకొచ్చాడు. ఇక ప్రోమో చివర్లో సుమాను నేను చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ ఉన్నాను అంటూ చెప్పడంతో తన ఏజ్ బయటపెట్టాడు అన్నట్లుగా సుమ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇది చూసిన ప్రేక్షకులు సుమ ఏజ్ గురించి చెప్పి అడవిశేషు పరువు తీసేసాడు అంటూ కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: