రాజకీయాల నుండి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న తరువాత చిరంజీవి రాజకీయాల గురించి ఒక్క కామెంట్ కూడ చేయడం లేదు. కేవలం తన సినిమాలు వ్యాపారాలు తన కుటుంబం తప్ప మరే విషయం పట్టించుకోవడం లేదు. అలాంటి చిరంజీవికి తెలియకుండా మెగా ఫ్యాన్స్ తమ మెగా హీరోను మళ్ళీ రాజకీయాల ఊబిలోకి లాగుతున్నారా అన్న సందేహాలు కొందరకు కలుగుతున్నాయి.


దీనికికారణం లేటెస్ట్ గా విజయవాడలో జరిగిన మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమ్మేళనం తెలుగు రాష్ట్రాలలోని మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు చాల అధిక సంఖ్యలో హాజరైన ఈసమావేశంలో మెగా అభిమానులు చేసిన తీర్మానం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడం తమ ధ్యేయం అనీ దీనికోసం తాము ఎలాంటి త్యాగలకైనా సిద్ధం అంటూ మెగా అభిమానులు వందల సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో ఈ తీర్మానం చేసారు.


దీనితో పవన్ ‘జనసేన’ వ్యూహాల వెనుక చిరంజీవి గాడ్ ఫాదర్ లా వ్యవహరించబోతున్నాడా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవి పవన్ అభిమానులు కలిస్తే పవన్ కు పడబోయే ఓట్ల శాతం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇలాంటి వ్యూహాలు అనుసరించాలి అంటే చాల అనుభవం ఉన్న రాజకీయ వేత్త మెగా అభిమానుల వెనక ఉండాలి.


కాపు సామాజిక వర్గం నిర్లక్ష్యం చేయబడుతోంది అన్న భావన వారిలో కలిగించగలిగితే పవన్ ‘జనసేన’ కు పడే ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. ఈ అంచనాలు ఇలా ఉంటే లేటెస్ట్ గా జరిగిన ఈ మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో చిరంజీవి పవన్ నాగబాబు రామ్ చరణ్ ల ఫోటోలు కనిపించాయి కానీ ఎక్కడ అల్లు అర్జున్ ఫోటో బ్యానర్లల పై లేకపోవడం అనేక చర్చలకు తావిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: