అయితే అప్పట్లో ఇతని చావు గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. మాములుగా ఎవరైనా ఒక రంగంలో సంపాదించిన డబ్బును వేరే రంగాల్లో పెట్టుబడిగా పెట్టి దాన్ని రెట్టింపు చేయడానికి చూస్తారు. ఇదే విధంగా అచ్యుత్ కూడా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేశాడు. అయితే వ్యాపారాలను థానే స్వయంగా చూసుకోవడం కుదరదు కాబట్టి ఆ బాధ్యతను తనకు బాగా నమ్మకమైన వారి చేతుల్లో పెట్టాడు. అయితే బాగా నమ్మినవాడే మోసం చేస్తారని తెలిసిందే. అదే విధంగా తన డబ్బును వీరు కాజేశారు.. అలా వ్యాపారాల్లో నష్టం వచ్చింది. దీనితో ఒక్కసారిగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయాడు అని సన్నిహితులు కొందరు అంటూ వచ్చారు.
అయితే తన గురించి బాగా తెలిసిన నటుడు, దర్శకుడు మరియు ఫ్రెండ్ ప్రదీప్ కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. వాస్తవంగా ఇప్పటి వరకు వైరల్ అయినవి అన్నీ అబద్దాలు. అచ్యుత్ బాడీలో అధిక కొలెస్టరాల్ కారణంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు. అందుకే ఎంత డబ్బు ఉన్న హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ప్రముఖులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి