విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ  పాజిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సంపాదించుకుంది. ఎఫ్ 3 మూవీ మొదటి వారం రోజులు మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఆ తరువాత వారం నుండి ఎఫ్ 3 మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ , విక్రమ్ సినిమాలతో పోటీ ఎదురైంది.  

జూన్ 3 వ తేదీన మేజర్ , విక్రమ్ సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ రెండు సినిమాలకు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కడంతో ఎఫ్ 3 మూవీ కలెక్షన్ లు అమాంతం పడిపోయాయి. ఇది ఇలా ఉంటే నిన్న అనగా ఆదివారం రోజు ఎఫ్ 3 , మేజర్ , విక్రమ్ సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. కాకపోతే ఈ మూడు సినిమాలలో ఆదివారం రోజు అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమాదే పైచేయి అయ్యింది.  ఆదివారం రోజు మేజర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.57 కోట్ల షేర్ , 5.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర సాధించి, విక్రమ్ ఎఫ్ 3 మూవీ లకు గట్టిపోటీని ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ రెండు సినిమాలతో పోలిస్తే అత్యధిక కలెక్షన్లను కూడా మేజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది.

ఆదివారం రోజు విక్రమ్ సినిమా 2.59 కోట్ల షేర్ , 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేయగా , ఎఫ్ 3 మూవీ 1.35 కోట్ల షేర్ , 2.30 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: