’మేజర్’ మూవీతో అడవి శేషు కు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈమూవీ కలక్షన్స్ పరంగా ఘనవిజయం సాధించినప్పటికీ ఈమూవీ చూసిన తరువాత చాలామంది అడవి శేషు కంటే సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఎలాంటి నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతడికి నటుడుగా కంటే రచయితగా రాణించడం చాలఇష్టం.
ఇండియాలో పుట్టినా పెరగడం అంతా అమెరికాలో జరగడంతో ఇతడికి తెలుగు మాట్లాడటం వచ్చుకానీ చదవడం రాదు. దీనితో ఇతడి తండ్రి అతడికి ఏదోవిధంగా తెలుగు చదవడం నేర్పించాలి అన్న ఉద్దేశ్యంతో ప్రతి వినాయకచవితి రోజున చవితి పూజా పుస్తకాన్ని అతడితో పట్టుపట్టి చదివించడంతో కొద్దిగా తెలుగు అక్షరాలు అలవాటు అయ్యాయి అని అంటున్నారు.
సినిమా పై వ్యామోహంతో తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఎవరు అవకాశాలు ఇవ్వని పరిస్థితులలో తనకు తానే నిర్మాతగా మారి ‘కర్మ’ అనే సినిమా తీసి ఆర్థికంగా నష్టపోయినప్పుడు తన కర్మ బాగాలేదు అంటూ తన స్నేహితులు చుట్టాలు తనపై వేసిన జోక్స్ తనకు ఎప్పుడూ గుర్తుంటాయి అన్నాడు. తాను పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటిస్తున్నప్పుడు పవన్ తనను చూసి తాను బొంబాయి నుండి వచ్చాను అనుకుని తనతో హిందీలో మాట్లాడుతున్నప్పుడు తాను తెలుగు వాడిని అని చెప్పినప్పటికీ పవన్ ముందుగా నమ్మలేదు అని అంటున్నాడు.తాను అమెరికాలో ఉన్నప్పుడు ఒక పంజాబీ అమ్మాయిని ప్రేమించిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆమె తన ప్రేమను రిజక్ట్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఆతరువాత తనకు పెళ్ళి పై పూర్తిగా ఆశక్తి పోయిందని ఇప్పుడు తన దృష్టి అంతా కెరియర్ తప్ప తన పెళ్ళి గురించి ఆలోచన లేదు అంటున్నాడు. తన ఇంటి కుటుంబ సభ్యులు కూడ ఈవిషయమై తనతో మాట్లాడటం మానేసారని ఈమధ్య తన తల్లితండ్రులు ఒక కుక్క పిల్లను తెచ్చుకుని తనతో కంటే ఆకుక్క పిల్లతో క్లోజ్ గా ఉంటూ తనను ఆటపట్టిస్తూ ఏదోవిధంగా తనకు పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని బయటపెట్టాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: