తాజాగా కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి ఇటీవల '777 చార్లీ' అనే సినిమాతో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓ కుక్కతో ప్రయాణం ఎలా ఉంది అని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమాలో.ఇకపోతే తాజాగా సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి చూసిన ప్రతి ఒక్కరు సినిమాని అభినందిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే సినిమా చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇదిలావుండగా ఇటీవల 777 చార్లీ సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే 777 చార్లీ సినిమాలో సంగీత శ్రింగేరి కథానాయికగా నటించగా కె. కిరణ్‌రాజ్‌ దర్శకత్వం వహించడం జరిగింది. అయితే తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేయడం జరిగింది. ఇదిలావుంటే జూన్‌ 10న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. ఇకపోతే ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమా చూసి సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ హీరో రక్షిత్ శెట్టికి ఫోన్ చేసి అభినందించారు. అయితే ఈ విషయాన్ని హీరో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు.ఇదిలావుంటే తాజాగా రక్షిత్ తన ట్వీట్ లో.. ఈ రోజు చాలా గొప్పగా మొదలైంది. ..అంతేకాకుండా రజనీకాంత్‌ సర్‌ ఫోన్‌ చేశారు. అయితే నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. అంతేకాక సినిమాను అంత క్వాలిటీగా, 

ఎంతో ఎమోషనల్ గా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్‌ తెరకెక్కించిన విధానం, మరియు ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని అన్నారు. అయితే సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం చాలా సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్‌ సర్‌ అని పోస్ట్ చేశాడు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి.ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన 169 సినిమా చేస్తున్నాడు ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: