యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఒకవైపు సినిమాలు ,మరో వైపు షో లు చేస్తూ ఫుల్ బిజిగా ఉంది.ఇక ఇప్పుడు స్టార్ మాలోనూ ఓ షో చేస్తోంది. ఇటు జబర్దస్త్, అటు సింగింగ్, మరో పండుగ ఈవెంట్లలోనూ పాల్గొంటూ రచ్చ చేస్తుంది..సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన టైం కేటాయిస్తుంటుంది. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంటుంది. అలా తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా అందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు మారుతి కూడా చెప్పేశాడు. దర్శకుడు మారుతి ఇప్పుడు మరింత బిజీగా మారిపోయాడు. గోపీచంద్, రాశీ ఖన్నాలను పెట్టి పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే.


ఈమూవీ జూలై 1న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని విస్తృతంగా ప్రచారం చేయాలని భావించినట్టుంది. అందుకే మారుతి గత కొన్ని రోజులుగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోకు మారుతి, గోపీచంద్‌లు గెస్టులుగా వచ్చారు. ఇందులో గోపీచంద్ తన డైలాగ్స్‌తో రెచ్చిపోయాడు. ఇక మారుతి తన స్టైల్లో మాట్లాడేశాడు. అనసూయ పక్కా కమర్షియల్ అంటూ ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పబోయాడు. చిన్న ఆఫర్ ఇస్తే.. నో చెప్పిందంటూ పక్కా కమర్షియల్ అని ఏదో చెప్పబోయాడు..


డైరెక్టర్ ఎదో చెబుతుండగా అనసూయ మాత్రం అతని నోరు మూసింది..చెప్పొద్దు అని సైగలు చేసింది.అయితే ప్రోమోలో ఇంత వరకు మాత్రమే ఉంది. పూర్తి ఎపిసోడ్‌లో ఏమైనా ఇంకా విషయాలు చెప్పి ఉంటాడు. మొత్తానికి అనసూయ మాత్రం అలాంటి చిన్న చిన్న రోల్స్ చేసేంత ఖాళీగా అయితే లేదు. అనసూయ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2, తన లేడీ ఓరియెటెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక మరో వైపు కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తమిళ, తెలుగు ద్వి భాష చిత్రాలను కూడా చేస్తోన్నట్టుంది. అయితే మాలీవుడ్‌లోనూ అనసూయ ఎంట్రీ ఇచ్చింది... మొత్తానికి చాలా బిజిగా ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: