టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినా లావణ్య త్రిపాటి తాజాగా రితీశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం జులై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 

ఆ తర్వాత ఈ మూవీ ని చెప్పిన తేదీ కంటే ముందు గానే అనగా జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొంత కొన్ని రోజుల క్రితమే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ లను వేగవంతం చేసింది. అందులో భాగంగా హ్యాపీ బర్త్ డే సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జూన్ 29 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఏ ఎం బి సినిమాస్ స్క్రీన్ 1 లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు అయిన ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరి ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మత్తు వదలరా లాంటి సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తర్వాత రితీశ్ రానా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో హ్యాపీ బర్త్ డే సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: