ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోయిన్ ల కంటే కూడా కుర్ర హీరోయిన్ ల హవా నే ఎక్కువ అయిపోయింది. కొత్తగా ప్రారంభం అయ్యే దాదాపు ఎ సినిమాలో చూసిన కుర్ర హీరోయిన్ లనే దర్శక నిర్మాతలు హీరోయిన్ లుగా పెట్టుకుంటున్నారు. అలా ప్రస్తుతం వరుస ఆఫర్ లను దక్కించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతున్న కుర్ర హీరోయిన్లలో కృతి శెట్టి, శ్రీ లీల ముందు వరుసలో ఉన్నారు.

ఇప్పటికే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే ఈ ముద్దుగుమ్మకు చాలా సినిమాల నుంచి అవకాశాలు  కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్రేజీ సినిమాలలో ఒకటి అయిన ఎన్టీఆర్ 30 వ సినిమా నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన 30 వ మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఆ హీరోయినే అంటూ ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కాకపోతే చిత్ర బృందం ఇప్పటి వరకు ఏ హీరోయిన్ పేరును కూడా అధికారికంగా ప్రకటించలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమా ఆఫర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టి మరియు శ్రీ లీల కు వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమా కోసం మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  మరి ఈ ముద్దుగుమ్మల డిమాండ్ కు ఒప్పుకొని ఎవరినో ఒకరిని హీరోయిన్ గా తీసుకుంటారా..? లేకపోతే కథ డిమాండ్ ప్రకారం ఇద్దరినీ హీరోయిన్ లని తీసుకుంటారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: