టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ మరియు మాస్ మూవీ లలో నటిస్తూ తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా , ఆది పినిశెట్టిమూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.  ఈ మూవీ లో రామ్ పోతినేని తన కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ లో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో అదిరిపోయే మాస్ డైలాగ్ లతో అదరగొట్టాడు. అలాగే ఈ ట్రైలర్ లో ఆది పినిశెట్టి తన అదిరిపోయే విలనిజం తో  ప్రేక్షకులను అలరించాడు.

అలాగే ఈ మూవీ ట్రైలర్ లో రామ్ పోతినేని , ఆది పినిశెట్టి కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. దానితో 24 గంటల్లో ది వారియర్ సినిమా ట్రైలర్ 10.53 మిలియన్ వ్యూస్ ను , 226.2 కే లైక్ లను సాధించింది. ప్రస్తుతం కూడా ది వారియర్ మూవీ ట్రైలర్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: