టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం టాలీవుడ్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.భారీ బడ్జెట్ తో మంచి పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కొన్ని రోజులుగా తాత్కాలికంగా బ్రేక్‌పడ్డది. దానికి కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాలే.ఇక ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు (AP farmers) అండగా నిలిచేందుకు కొంత కాలంగా కౌలు రైతు భరోసా యాత్రలో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. ఇక త్వరలో మళ్లీ మేకప్ వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త అభిమానుల్లో ఇప్పుడు పెద్ద జోష్ నింపుతోంది.ఇక తాజా అప్ డేట్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే త్వరలోనే షూటింగ్ పనులను షురూ చేయబోతున్నాడట. మొదట హరిహర వీరమల్లు చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది.


ఇక ఆ వెంటనే తమిళ దర్శక నటులు సముద్రఖని డైరెక్షన్‌లో చేయబోతున్న వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ షూటింగ్‌లో సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు. ఇంకా అలాగే అక్టోబర్ నెల నుంచి ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ టూర్ మొదలుపెట్టనున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌.ఇక ఆ లోపు ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేయనున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. ఇక పాన్ ఇండియా సినిమా అయిన హరిహరవీరమల్లు చిత్రంలో హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.ఇంకా అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్..కాగా సీనియర్ తమిళ తెలుగు సినిమాల నిర్మాత  అయిన ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: