మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో శరత్ మండవ దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించబోతున్నాడు. 

ఎస్‌ఎల్‌వి సినిమాస్‌, ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన రాజిష విజయన్ , దివ్యాంకా కౌశిక్  హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా , సమ్ సి ఎస్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ను జూలై 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో రవితేజ బ్లాక్ టీ తాగుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి క్రాక్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ఆ తర్వాత ఖిలాడి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: