‘విక్రమ్’ మూవీ తరువాత హిట్ అన్నపదాన్ని ఇండస్ట్రీ వర్గాలు మర్చిపోయి దాదాపు 6వారాలు దాటిపోతోంది. దీనితో కలక్షన్స్ లేక ధియేటర్లు వెలెవెల పోతున్నాయి. దీనికితోడు ప్రేక్షకులు ఏసినిమాకు వస్తారో ఏసినిమాకు రారో తెలియని పరిస్థితి. సగటు ప్రేక్షకుడి అభిరుచిని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదలకాబోతున్న ‘థాంక్యూ’ మూవీ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ మూవీని ఫీల్ గుడ్ మూవీగా తీర్చిదిద్దినట్లు సంకేతాలు వస్తున్నాయి. సాధారణంగా ఫీల్ గుడ్ మూవీలు అన్నీ స్లోగా ఉంటాయి. సగటు ప్రేక్షకుడు కోరుకునే మాస్ మసాలాతో పాటు సినిమా చాల స్లోగా నడుస్తుంది.


ఇప్పుడు ఈవిషయమే దిల్ రాజ్ కు టెన్షన్ పెడుతున్నట్లు టాక్. ఈమూవీ నిడివి 2.52 నిముఃలు వస్తే సినిమా నిడివి మరీ ఎక్కువైపోయిందని భావించిన దిల్ రాజ్ విక్రమ్ కుమార్ చేత పట్టుపట్టి ఈమూవీ నిడివిని 2గంటల 10నిముషాలకు కుదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫీల్ గుడ్ మూవీల నిడివి ఎక్కువగా ఉంటుంది. అవి స్లోగా నడుస్తాయి. ఆతీరుకు భిన్నంగా దిల్ రాజ్ ఈమూవీ నిడివికి ఎక్కడపడితే అక్కడ కత్తిరి వేయడంతో అసలకు మోసం వస్తుందా అన్న గాసిప్పులు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి.


దీనికితోడు రాశి ఖన్నా ఐరన్ లెగ్ సెంటిమెంట్ కూడ ఈమూవీ పై ప్రభావం చూపెడుతుందా అంటూ చైతన్య అభిమానులు భయపడుతున్నారు. వాస్తవానికి చైతన్య గత సంవత్సరం నటించిన ‘లవ్ స్టోరీ’ హిట్ వచ్చినప్పటికీ ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవి ఖాతాలోకి వెళ్లిపోయింది. హీరోగా చైతన్యకు పెద్దగా కలిసిరాలేదు. దీనితో చైతన్య ఈమూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. అదేవిధంగా దర్శకుడు విక్రమ్ కుమార్ రాశి ఖన్నా లకు కూడ ఒక సాలిడ్ హిట్ కావాలి. దీనితో ఇంతమంది కెరియర్ ను ప్రభావితం చేసే సినిమాగా ‘థాంక్యూ’ మారింది..మరింత సమాచారం తెలుసుకోండి: