నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ప్రాస్టిజిస్ గా తీసుకొని నటించిన  సినిమా బింబిసార. ఈ మూవీ ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.  ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు అదిరిపోయే రేంజ్  గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ కూడా ఈ ట్రైలర్ లో ఉండడంతో ఈ ట్రైలర్ ఎంతో మంది ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ని కూడా పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా బింబిసార  చిత్ర బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 29 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

పోస్టర్ లో కళ్యాణ్ రసం రెండు డిఫరెంట్ గెటప్ లలో కనిపిస్తాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు. మరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: