ఇక ఈ కాలం ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలంటే ఖచ్చితంగా వినూత్నంగా ప్రచారం చేయాల్సిందే. ఎంత కొత్తగా ప్రచారం చేస్తే, అంత ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది.పైగా ఈ ప్రచారాన్ని ఎన్ని రోజులు కొనసాగించామనే అంశంపై కూడా ప్రేక్షకాదరణ అనేది ఉంటుంది.ఇక ఈ విషయంలో మాచర్ల నియోజకవర్గం యూనిట్ బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి.ఈ సినిమా కోసం టీం చాన్నాళ్ల కిందటే ప్రచారం చేశారు. ఫస్ట్ లుక్స్ విడుదల నుంచి సింగిల్స్ రిలీజ్ చేసే వరకు కూడా ప్రతి అంశంలో అంతోఇంతో కొత్తదనం పాటించారు. నేరుగా సింగిల్స్ రిలీజ్ చేయకుండా, ప్రత్యేకంగా ఈవెంట్స్ కూడా చేశారు. టీజర్ కోసం ఏకంగా పెద్ద ఫంక్షన్ ని కూడా పెట్టారు.ఇప్పుడు ఆ ప్రచారాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు మూవీ మేకర్స్.ఈ సినిమా నుంచి ఏకంగా ఓ సాంగ్ ను విడుదల చేశారు.


రిలీజ్ కు ముందు 2 నిమిషాల వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం అసలు కొత్త కాదు. కానీ మాచర్ల నియోజకవర్గం మేకర్స్ మాత్రం ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసి పెద్ద సంచలనం సృష్టించారు.ఇక ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ విషయానికి వస్తే..జులై 30 వ తేదీ నుంచి ట్రైలర్ ఈవెంట్ స్టార్ట్ చేసి ఇంకా భారీగా ప్రమోషన్స్ చెయ్యడానికి సిద్ధం అయ్యారు.ఇక ఆగస్ట్ 12న రిలీజ్ అవుతోంది మాచర్ల నియోజకవర్గం. ఇప్పటికే ప్రచారాన్ని చాలా పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి మరిన్ని వినూత్నమైన ఆలోచనలతో ఈ యూనిట్ ముందుకొచ్చే అవకాశం కూడా ఉంది. తన సొంత సినిమా కావడంతో, నితిన్ ఈ ప్రాజెక్టుపై చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాడట. కేవలం ప్రచారం కోసమే ఆయన దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: